45 రోజులు అన్న ప్రసాద వితరణ

అయ్యప్ప స్వామి మాలదారులకు  ఎన్బీఆర్ ఫౌండేషన్ చేయూత

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

” 45 రోజుల పాటు అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం అసాధారణ విషయం. ఎంతో భక్తి భావంతో, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అయ్యప్ప స్వామి మాలదరులకు సేవలందించిన ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధ అభినందనీయులు. ఇది దైవ కార్యం…యువనేత సంకల్పం. అయ్యప్ప స్వామి భక్తుల, భక్తజనుల కుటుంబీకులు ఆశీస్సులు, దీవెనలు యువనేతతో ఎల్లప్పుడూ ఉంటాయని నేను ఆశిస్తున్నాను. దాదాపు నెలన్నర రోజుల పాటు అయ్యప్ప స్వామి మాలధారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఏర్పాట్లలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు కలగకుండా అన్నప్రసాద వితరణను, పూజా కార్యక్రమాల నిర్వహణను ప్రతి రోజు అందుబాటులో ఉండి తమ నిత్యకృత్యంలా భావించి పర్యవేక్షించిన ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల కృషి శ్లాఘనీయం. ఐక్యత భావాన్ని పెంపొందించేలా యువనేత నిర్వర్తించిన ఈ బృహత్తర కార్యక్రమం మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల గుండెలో చెరగని ముద్రలా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను. మరోసారి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 45 రోజులపాటు నిర్విఘ్నంగా అయ్యప్ప స్వామి మాలధారులకు సేవలందించిన నల్లమోతు సిద్దార్ధ గారికి నా యొక్క హార్ధిక అభినందనలు. ప్రియతమ శాసనసభ్యులు, మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత భాస్కర్ రావు గారి సిద్ధాంతాలను, ఆశయాలను కుణికిపుచ్చుకొని విజయపథంలో, ప్రజాసేవలో మడమ తిప్పకుండా ముందుకెళ్తున్న యువనేత నల్లమోతు సిద్దార్దకు ఎల్లప్పుడూ జయం కలగాలని కోరుకుంటున్నాను…దైవ కృపతో నిర్విఘ్నంగా ఆయనకు విజయం తథ్యం…స్వామియే శరణం అయ్యప్ప….స్వామి శరణం…అయ్యప్ప శరణం. “

Leave A Reply

Your email address will not be published.

Breaking