
దారి “పంచాయతీ”
అక్రమంగా కూలగొట్టే యత్నం
జేసిబితో సిబ్బంది హడావుడి
నంగునూరు, అక్షిత ప్రతినిధి :
పంచాయతీ దారికి పట్టేదారు ఇల్లు కూలగొట్టే యత్నం. పట్టపగలే జేసిబితో పంచాయతీ సిబ్బంది హడావుడి. 20 ఏళ్ల కిందట సత్తయ్య ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు కట్టకోగా సర్పంచ్ భర్త కూలగొట్టెందుకు సిద్ధమయ్యారు.

వివరాల్లోకి వెళితే…నంగునూరు మండలం ఘనపూర్ గ్రామ పంచాయతీకి రోడ్ కావాలని సర్పంచ్ బత్తుల రజిత భర్త తిరుపతి అన్యాయంగా అక్రమంగా ఎంతో కష్టపడి కట్టుకున్న సత్తయ్య ఇల్లును కూలగొట్టి గ్రామపంచాయతీ దారిని తీయాలని కుట్రపన్ని బుధవారం పోలీసు వారిచే మా ఇల్లుపై జెసిబి తీసుకొచ్చి మా కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి కుట్ర పన్నాడని గమల సత్తయ్య కొడుకు నరసింహులు తన ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఈ స్థలాన్ని 20 ఏళ్ల కింద బొజ్జ రాజయ్య దగ్గర కొన్న జాగా…ఊరికే గ్రామపంచాయతీ ఇచ్చిన జాగా కాదన్నారు. 20 ఏళ్ల నుంచి ఎందరో సర్పంచులు వచ్చి పోయారు. కానీ ఇలాంటి దుర్మార్గమైన పని ఎవరు కూడా చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కోసం మా ఇల్లులు కూలగొట్టడం ఎంతవరకు సమంజసమో పై అధికారులు ఆలోచించి మా ఇల్లును కూలగొట్టకుండా ఆపాలని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు.

మా నాన్న, అమ్మ, మా భార్య పిల్లలకు కూడా ప్రాణానికి ముప్పు ఉందని, సహాయం చేసే పోలీసులే నా ఇల్లు కూలగొట్టడానికి ముందు వరుసలో ఉన్నారన్నారు. నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పారు. మా గ్రామ ప్రజలంతా ఏకమవడం వల్ల జెసిబి వెనుకకు తీసుకెళ్లారన్నారు. చట్టం ప్రకారమే నేను ఇల్లు కట్టానని గరిపట్టి నల్లా బిల్లు ఎప్పటికప్పుడే చెల్లిస్తున్నానని చెప్పారు. సర్పంచి మీరు గ్రామానికి మంచి చేయకున్న పర్వాలేదు కానీ మాలాంటి పేద వాళ్ళ గూడును కూలగొట్టాలని చూడకని తెలిపారు. మా ఇల్లు న్యాయంగా కట్టడం జరిగిందన్నారు. రోడ్డుపైన కట్టలేదు…పై అధికారులు మా ఇల్లును కూలగొట్టకుండా మాకు న్యాయం చేసే దాకా మేము మా ఇల్లును వదిలేదు లేదని అక్కడే టెంటు వేసుకొని గ్రామ ప్రజలందరూ కూడా గండ్ల సత్తయ్య కుటుంబానికి అండగా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే జెసిబికి తీసుకొని వెనుకకు వెళ్లారు…ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.