బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి
-ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల, అక్షిత ప్రతినిధి :
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి అన్నారు.శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చేర్యాల కొమురవెల్లి మద్దూరు దుల్మిట మండలాలకు చెందిన బిఆర్ఎస్ నాయకులు చేర్యాల మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన రైతు మహా ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంటే చూస్తూ ఓరువలేక బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు.సీఎం కేసీఆర్ సారధ్యంలో భారత దేశంలోని అన్నిరాష్ట్రాలకు తెలంగాణలో మాదిరిగా సంక్షేమ పథకాలు అందించాలని ఇతర రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి అన్నారు.బీజేపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన తెలంగాణ తో పాటు యావత్ దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అందించడంలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పులుపునిచ్చారు.అనంతరం చేర్యాల మండలానికి చెందిన బిజెపి కార్యకర్తలు సుమారు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో చేర్యాల మండల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్,జడ్పిటిసి శెట్టి మల్లేశం, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఏ స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అనంతల మల్లేశం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎల్లారెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు,జడ్పిటిసిలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.