క్రీస్తు దయతో ప్రజలంతా బాగుండాలి
– ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల, అక్షిత ప్రతినిధి : చేర్యాల పట్టణ కేంద్రంలోని వీరభద్ర గార్డెన్లో క్రిస్మస్ సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరై మాట్లాడుతూ ఏసు ప్రభుదయతో ప్రజలంతా బాగుండాలని కోరినారు.యేసు క్రీస్తు ప్రజల కోసం ముండ్ల కిట్టంతో రక్తం చిదిన కూడా సిలువను మోసిన కరుణామయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో కుల మతాలకు అతీతంగా బతుకమ్మ,రంజాన్, క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం కొమురవెల్లి మద్దూరు దూల్మిట్ట చేర్యాల మండలాలకు చెందిన పాస్టర్లకు క్రిస్మస్ దుస్తులను పంపిణీ చేసినారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా కేకు కట్ చేసి స్వీట్లను పంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినారు.అనంతరం కొమురవెల్లి,దుల్మిట్ట మండలాలకు చెందిన కళ్యాణం లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు సంఘ సేవకులు, చెందిన పాస్టర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఏఎంసి చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.