కొలువుల జాతర
783 పోస్టులతో గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. న్యూఇయర్ సందర్భంగా ప్రభుత్వం కానుకను అందించింది. 783 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. గతంలో 1032 పోస్టులను గ్రూప్-2 కింద భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక గ్రూప్-4 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది.