వ్యవసాయ, విద్యాశాఖల్లో కొలువుల జాతర

వ్యవసాయశాఖ, విద్యాశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండుశాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. వ్యవసాయశాఖలో వ్యవసాయ అధికారి 148 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 100 మల్టీజోన్‌-1 పోస్టులు, మల్టీజోన్‌-2లో 48 పోస్టులను నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి అదే నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.

విద్యాశాఖలో 128 పోస్టులకు..
విద్యాశాఖలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2023 జనవరి 6వ తేదీ నుంచి అదే నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించింది. 18-44 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు అర్హులని పేర్కొంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌ tspsc.gov.inలో సంప్రదించాలని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking