బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ పాలక్ గా శ్రీశైలం గౌడ్

బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ పాలక్ గా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ 

కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకరావడానికి రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాలక్ లను నియమించింది. ఇందులో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని అసెంబ్లీ పాలక్ గా నియమించింది. ఈ నియామకం పట్ల శ్రీశైలం గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ కి, సునీల్ బన్సల్ కి, తరుణ్ ఛుగ్ కి, ధన్యవాదాలు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking