మిర్యాలగూడ ప్రగతికి భాస్కర్ రావు మార్క్
పల్లెల రహదారులకు మోక్షం
మాడ్గులపల్లి మండలం 4 గ్రామాల్లో ఎస్డీఎఫ్ కింద రూ.8లక్షలతో బిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు నలమోతు విశిష్ట కృషి చేస్తుండ్రు. ప్రధానంగా మౌళిక సదుపాయాల కల్పన దిశగా రహదారులు, విద్యుత్, తాగు నీరు, మురుగు కాల్వలు తదితర సమస్యల సాధనకు భాస్కర్ రావు మార్క్ గా విశిష్ఠ కృషి. మిర్యాలగూడ అసెంబ్లీ నయోజకవర్గం మాడ్గులపల్లి మండల పరిధిలోని ఇస్కబావిగూడెం, తోపుచర్ల, కుక్కడం, చిరుమర్తి గ్రామాలకు స్పెషల్ డెవెలప్ మెంట్ ఫండ్(ఎస్డిఎఫ్) గ్రాంటు ద్వారా గ్రామానికి 20 లక్షల చొప్పున మొత్తం మంజూరు అయిన 80లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులకు గురువారం శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు, కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, వేములపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జేర్రిపోతుల రాములు గౌడ్, సీనియర్ నాయకులు పొనుగోటి చొక్కారావు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ మౌలాలి, సర్పంచ్లు అల్గుబెల్లి గోవిందరెడ్డి, నిమ్మల గోవిందమ్మ, మారుతి వెంకట్ రెడ్డి, శ్రీశైలం, మంగా యాదయ్య, సైదులు, ఎంపీటీసీ కత్తి కనకారెడ్డి, కళింగరెడ్డి, నాయకులు కట్టా మల్లేష్ గౌడ్, యాతం నరేందర్ రెడ్డి, కర్ర ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ డిఇఇ వెంకటేశ్వర్రావు, ఎంపిడిఓ జితేందర్రెడ్డి, మేకల నాగయ్య, కూరేళ్ళ వెంకటచారి, ఎరేడ్ల అంజిరెడ్డి, నకిరేకంటి శ్రీను, గోపాల్రెడ్డి, శర్మ, ఉప సర్పంచ్లు, వార్డ్ సభ్యులు, గ్రామ పార్టీ అద్యక్షులు, ఎఇలు పాల్గొన్నారు.