కాంగ్రెస్ ను వీడి… గులాబీ గూటికి

కాంగ్రెస్ ను వీడి… గులాబీ గూటికి
కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ *

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మాడ్గులపల్లి, అక్షిత ప్రతినిధి :

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు అకర్షితులై భారతీయ రాష్ట్ర సమితిలో చేరిన ప్రతి ఒక్కరికి అన్ని వేళలా అండగా ఉంటానని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మాడ్గులపల్లి మండలం ఇస్కబావిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జిన్నె వెంకట్ రెడ్డి, టిడిపి నాయకుడు పుట్ట శ్రీనివాస్ తదితరులు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి అకర్షితులై అనేకమంది బిఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు. కొత్త పాత అనే తేడాలేకుండా అందరు కలిసి పని చేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యుడు మహమ్మద్ మోసిన్ అలీ, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, వేములపల్లి పిఎసిఎస్ చైర్మన్ జెర్రిపోతుల రాములుగౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మారుతి వెంకట్ రెడ్డి,సర్పంచ్ నిమ్మల గోవిందమ్మ, పోరెడ్డి కోటిరెడ్డి, యాతం లక్ష్మీ నరేందర్ రెడ్డి, మేకల లింగమ్మ నాగయ్య, వాంకుడొతు సుధాకర్, ఎంపిటిసిలు యాతం కళింగరెడ్డి, కత్తి కనకారెడ్డి,నాయకులు పోనుగోటి చొక్కారావు, కట్టా మల్లేష్ గౌడ్, అవిరేండ్ల నర్సింహ,గుదే సత్యనారాయణ శర్మ, నకిరేకంటి శ్రీను, కురెళ్ల వెంకటాచారి,గున్ రెడ్డి గోపాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking