
కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ ని కలిసిన విద్యుత్తు జేఏసీ నాయకులు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మంకి విచ్చేసిన కేరళ ముఖ్యమంత్రిని విద్యుత్ శాఖ జెఏసి నాయకులు కలిసి వినతిపత్రం అందజేసి పుష్ప గుచ్చాన్ని అందజేసినారు.దేశంలో ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు ఇంజనీర్లు కార్మికులు కలిసి అనేక విధాలుగా పోరాడుతూ ధర్నాలు, సదస్సులు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎన్ని రకాలుగా ఏకకంఠంతో విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం మను ముందుకి వెళుతూనే ఉన్నది.

ఎంతోమందికి ఉపయోగపడే విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడం వల్ల రైతులకు సామాన్య ప్రజానీకానికి ధరలపెరిగి దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది కావున విద్యుత్ ప్రైవేట్ ఈ కరణ ఆపాలని విద్యుత్ ప్రైవేటీకరణ పోరాటానికి మద్దతిస్తున్న కేరళ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ వంతు సహకారాన్ని అందజేయవలసిందిగా వినతి పత్రం ఇచ్చి అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ టి శేషగిరి రావు కన్వీనర్ డి ఈ అంజయ్య సిఐటియు నాయకులు ముత్తమాల ప్రసాద్ జేఏసి నాయకులు రాందాస్ కే రమేష్ సిహెచ్ కమలాకర్ ఎన్ సీతయ్య ట్రాన్స్కో ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.