
ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ లో మండల స్థాయికి ఎంపికైన విద్యార్థులు
చేర్యాల, డిసెంబర్ 29 అక్షిత న్యూస్ : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ ఉన్నత పాఠశాలలో గురువారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో 9, మరియు 8 వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యం పై పాటశాల స్థాయి రాత పరీక్ష, మరియు ఆంగ్లంలో నీతి కథల పోటీ నిర్వహించారు.ఇందులో రాత పరీక్ష లో జి భారత్,ఎస్ అఖిల్ మరియు నీతి కథల పోటీలో జి ప్రణీత,టి సింధు ఉత్తీర్ణులై మండల స్థాయిలో జరిగే పోటీకి ఎంపిక అయ్యారు.ఈ పోటీలకు ప్రధాన ఉపాధ్యాయులు ఎం.ఐలయ్య కన్వీనర్ మరియు ఆంగ్ల ఉపాధ్యాయులు బూరుగు సత్య నారాయణ గైడ్ టీచర్ గా వ్యవహించారు.మండల స్థాయి కి ఎంపిక అయిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.