అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు అభినందనలు
చేర్యాల, డిసెంబర్ 29 అక్షిత న్యూస్ : సిద్దిపేట జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ మహేందర్ బాధ్యతలను చేపట్టి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ ప్రతినిధి కర్రోళ్ల అన్నమ్మ నవజీవన్ డిప్యూటీ కమిషనర్ మహేందర్ కు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపినారు. అనంతరం అన్నమ్మ నవజీవన్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను అనునిత్యం పరిరక్షిస్తున్న పోలీసుల కృషి ఎనలేనిదన్నారు.