
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కౌన్సిలర్…
మేడ్చల్, అక్షిత బ్యూరో :
దుండిగల్ పురపాలక పరిది డి. పోచంపల్లి ఎనిమిదోవ వార్డు సాయి పూజ కాలనీలో మల్లారెడ్డి హస్పటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని కౌన్సిలర్ సాయి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారెడ్డి ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీజనల్ వ్యాధుల వల్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు డా రమ్య, డా మానస రెడ్డి , మేనేజర్ ఎండి మహమ్మద్, పవన్ కుమార్, సిబ్బంది రేష్మ, షారుణ్ బి ఆర్ఎస్ పార్టీ ఎనిమిదొవ వార్డు అధ్యక్షులు సర్వర్ ఎండి జాంగిర్. మైనార్టీ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు…