సావిత్రిబాయి ఫూలే దేశ మహిళలందరికి స్ఫూర్తి*

సావిత్రిబాయి ఫూలే
దేశ మహిళలందరికి స్ఫూర్తి*

*- ప్రియదర్శిని మేడి*

చిట్యాల, అక్షిత న్యూస్ :

మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడిన మహనీయురాలు సాయిత్రీబాయి పూలే అని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. నకిరేకల్ బాలికల హాస్టల్ లో సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు.దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆమె అందించిన సామాజిక సమానత్వ జ్జానాన్ని, చారిత్రక కృషిని బిఎస్పీ నాయకులు, విద్యార్థులు స్మరించుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని ధారపోశారని అన్నారు. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం మహోన్నతమైందని, నేటి తరానికి స్పూర్తిదాయకమని కొనియాడారు.బడుగు బలహీన వర్గాలు, మహిళల సమాన హక్కుల సాధన కోసం తాను ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఛీత్కరింపులు అవమానాలు ఎదురైనా, మొక్కవోని దీక్షతో ప్రతిఘటిస్తూ సావిత్రీబాయి ముందుకు సాగారని గుర్తుచేశారు. విధ్వేషాలకు వ్యతిరేకంగా తన ఆశయాల సాధన కోసం ధృఢ చిత్తంతో మహా సంకల్పంతో.. సావిత్రిబాయి పోరాడారని ఆమె కీర్తించారు. సంఘసంస్కర్తగా, రచియిత్రిగా సామాజిక సంస్కరణలకై నడుం బిగించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశాభ్యున్నతికి సావిత్రీబాయి అందించిన స్పూర్తిని నేటితరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత దేశ ప్రగతికి సామాజికాభ్యున్నతికి వారి ఆలోచనలు నేటికీ ఆచరణ యోగ్యమైనవేనని తెలిపారు. జీవితపు చివరి క్షణం వరకు పీడిత ప్రజల సేవకోసమే అంకితమైన సావిత్రిభాయి ఫూలే సేవాతత్పరత, యావత్ భరతజాతికి ప్రాత:స్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్,నటువ కవిత, శ్వేతా, ధనలక్ష్మి, కీర్తన, మైన, అనూష, అఖిల తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking