
రహదారులు… ప్రగతికి సోపానాలు
1.60 కోట్లతో అభివృద్ది పనులు
ఎంఎల్ ఏ భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మండల పరిదిలోని ఎనిమిది గ్రామాల్లో రూ. 1కోటి 60 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే భాస్కర్ రావు తెలిపారు. మంగళవారం మండలంలోని గోగువారిగూడెం, వాటర్ ట్యాంక్ తండ, భగ్యగోప సముద్రం తండ, చిల్లాపురం, కుంటకింది తండ, ఐలాపురం, కుర్యా తండ, లావుడి తండ గ్రామాల్లో ఎమ్మెల్యే భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షల చొప్పున నిధులు కేటాయించామని, ఆ నిధులతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, ఎంపిపి నూకల సరళ హనుమంతరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, చిట్టిబాబునాయక్, ఏడుకొండలు, పిఆర్ డిఈఈ వెంకటేశ్వర్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.