ఐద్వా జాతీయ మహాసభలకు జిట్ట సరోజ ఎంపిక

ఐద్వా 13వ జాతీయ సమావేశాలకు హాజరుకానున్న జిట్ట సరోజ

చిట్యాల, అక్షిత ప్రతినిధి :

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పట్టణంలో జనవరి 6 నుండి 9వ తేదీ వరకు జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ మహాసభలకు తను ఎంపికైనట్లు ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ తెలిపారు. 13వ జాతీయ మహాసభలకు నల్గొండ జిల్లా నుండి నలుగురు ప్రతినిధులు ఎంపిక కాగా వారిలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోలేబోయిన వరలక్ష్మి, పాలడుగు ప్రభావతితో పాటు జిట్ట సరోజ , భూతం అరుణలు హాజరు కానునట్లు తెలిపారు. మహాసభలకు మహిళా సంఘం జాతీయ నాయకురాలు మాజీ ఎంపీ బృందావకరత్ హాజరై ప్రారంభం ఉపన్యాసం చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించే అవకాశం ఉందని తెలిపారు జాతీయ మహాసభలకు తనను ఎంపిక చేసిన ఐద్వా రాష్ట్ర జిల్లా కమిటీలకు జిట్టా సరోజ కృతజ్ఞతలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking