బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ…
నంగనూర్, అక్షిత న్యూస్ :
నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బిజెపి మహిళ మోర్చా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 17 వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగినది, ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పాఠశాలలో ఏ విద్యార్థి అయితే తమ మార్కులు వస్తాయో వారికి ఉన్నత స్థాయి చదువులకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. స్త్రీలు ముగ్గులే కాదు అంతరిక్షం లో రాకెట్ తోలే రోజులు వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అద్భుతంగా రానించి ఉన్నత స్థాయికి చేరి వారి కుటుంబా పేరు ప్రతిష్టలు కాపాడాలని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామని బాధపడకుండా ప్రవేట్ పాఠశాల విద్యార్థులకు పోటీగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి యాదమల్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ,
ఉపాధ్యాయులు తదితరులు పాల్గొనన్నారు.