శభాష్ గూడెంలో కాంగ్రెస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ
చేర్యాల,జనవరి 05 అక్షిత న్యూస్: చేర్యాల మండలంలోని శభాష్ గూడెం గ్రామంలో గురువారం యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ యామ సిద్దులు ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిద్ధులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నుండి నిధులు కాజేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జాన్, ఉప సర్పంచ్ కనకయ్య, గజ్జి కనుకయ్య, ఆకుల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.