కేటిఆర్ ప్రశంసలందుకున్న శాంతి కుమార్

కేటిఆర్ ప్రశంసలందుకున్న శాంతి కుమార్
స్వచ్ఛ సర్వెక్షణ అవార్డు ప్రదానం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

చొప్పదండి మున్సిపల్ కమీషనర్ పియస్ శాంతి కుమార్ తెలంగాణ రాష్ట్ర పురపాలక, అర్బన్,ఐటి పారిశ్రామిక శాఖల మంత్రి కేటిఆర్ ప్రశంసలందుకుండ్రు.
గురువారం మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అవార్డుల ప్రధానం జరిగింది.స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా చొప్పదండి మున్సిపల్ ఎన్నికైoది. దేశ వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటిలను పరిగణలోకి తీసుకొని స్వచ్ఛ సర్వేక్షన్ 2022
అవార్డులకు గాను పరిశీలించగా తెలంగాణకు ప్రతి ఏటా అవార్డులు దక్కుతున్నాయి. ప్రస్తుత ఏడాదికి గాను కొన్ని మున్సిపాలిటిలు ఎంపిక కాగా అందులో చొప్పదండి సైతం దక్కించుకుంది. శాంతికుమార్ అవార్డు దక్కించుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking