అక్షిత అక్షరం… ప్రజాపక్షం

 

అక్షిత అక్షరం… ప్రజాపక్షం
ఐఅండ్ పిఆర్ డైరెక్టర్ రాజమౌళి
టియూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అక్షిత అక్షరం… ప్రజల చేతుల్లో ప్రజాపక్షంగా వెలుగొందుతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, టియూడబ్ల్యుజే – ఐజేయూ విరహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కే.సత్యనారాయణలు అన్నారు. గురువారం ఐఅండ్ పిఆర్ కార్యాలయంలో అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక ఎడిటర్ యం.దాస్ తో కలిసి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ ప్రజా సమస్యల సాధనకు కృషి చేస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ల సారధ్యంలో పత్రిక ఎన్నో సామాజిక అంశాలకు తోడుగా మానవీయ, పరిశోధనాత్మక కథనాలను వెలుగులోకి తెస్తూ పరిష్కారానికి చొరవ చూపుతుందని ఆయన తెలిపారు. మరింత నిత్య నూతనత్వంతో మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. దశాబ్దంన్నర కాలంగా అక్షిత అక్షర శంఖం మోగిస్తుందన్నారు.

అక్షిత దిన దిన ప్రవర్ధ మానంగా అక్షిత అక్షరం ప్రజాయుధంగా వెలుగొందుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్, హెచ్ యూజే అధ్యక్షులు శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శౌఖత్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఇంద్రారెడ్డి, టియూడబ్ల్యుజే నేతలు , యాతాకుల అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐఅండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్ లు జగన్, శ్రీనివాస్ లు అక్షిత క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking