అంధత్వ నివారణకు… కంటి వెలుగు

చేర్యాల ఆకునూరు గ్రామాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

చేర్యాల,జనవరి18 అక్షితన్యూస్ : రెండో విడత కంటి వెలుగు పరీక్షల ప్రారంభం కానున్న సందర్భంగా, బుధవారం సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజముల ఖాన్ చేర్యాల మున్సిపల్ పట్టణ కురుమవాడలోని ప్రైమర్ స్కూల్లో ప్రారంభమయ్యే కంటి వెలుగు కేంద్రాన్ని పర్యవేక్షించినారు.అనంతరం ఆకునూరు గ్రామంలో అడిషనల్ కలెక్టర్ రెండో విడత కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించి, మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రైమర్ స్కూల్ మరియు హైస్కూల్లో జరిగే పనులను పర్యవేక్షించి, ప్రైమరీ స్కూల్లో పిల్లల చదువులను పరిశీలించారు. అనంతరం గ్రామ సర్పంచ్ చీపురు రేఖ కలెక్టర్ ను సన్మానించినారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఏ స్వరూప రాణి, కమిషనర్ రాజేంద్రకుమార్, ఎంపీడీవో సయ్యద్ తార్విక్ అన్వర్, ఎంపీ ఓ, ఆకునూర్ గ్రామ సెక్రెటరీ బాలయ్య, వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, మరియు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking