
*మంచిర్యాల జిల్లాలో అసైన్డ్ భూములకు మాజీ ఎమ్మార్వో, ఆర్డీవో సంతకాలతో సహా అక్రమ పట్టాలు*
*విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలి*
*బిఎస్పీ జిల్లా నాయకులు ఎం.వి.గుణ*
*మంచిర్యాల, అక్షిత బ్యూరో:-*
మంచిర్యాల జిల్లాలో అసైన్డ్ భూములకు మాజీ ఎమ్మార్వో, ఆర్డీవో సంతకాలతో సహా అక్రమ పట్టాలు చేశారని, దీనిపై విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని బిఎస్పీ జిల్లా నాయకులు ఎం.వి. గుణ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పోచంపాడు గ్రామం శివారు లోని సర్వే నం. 94 లో అమరగానీ ఐలయ్య, మాజీ ఎమ్మార్వో, మాజీ ఆర్డీవో లతో కలిసి దాదాపు 40 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను లబ్దిదారుల నుండి లాక్కొని తనపై, కుటుంబ సభ్యులపై అక్రమ పట్టాలు చేయించుకొని అక్రమంగా అనుభవిస్తున్నారని అన్నారు. ఇట్టి దారుణాలపై విచారణ చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జోనల్ మహిళా కన్వీనర్ భవానీ, మంచిర్యాల జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద తదితరులు పాల్గొన్నారు.