విద్యుత్ షాక్ గురై మహిళా మృతి. 

విద్యుత్ షాక్ గురై మహిళా మృతి. 

దుబ్బాక అక్షిత ప్రతినిధి :

సిద్దిపేట జిల్లారాయపోల్ మండల పరిధిలోని అనాజపూర్ గ్రామంలో బుధవారం వరి నాటు వేసేందుకు వ్యవసాయం పొలం వద్దకువెళ్లి రాచకొండ లక్ష్మి (55) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలంలోని అనాజపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతి రావాలి భర్త బాలమల్లు తెలిపిన వివరాల ప్రకారం రాచకొండ యాదగిరి వ్యవసాయ పొలంలో నాటు వేసేందుకు కొందరు మహిళలు వెళ్లారు. నాటు వేసే పొలం వెళ్లే మార్గంలో మాల పోచమ్మ ఆలయం చుట్టూ ఫెన్సింగ్ వైర్ విద్యుత్ స్తంభానికి అనుకోని ఉండగా విద్యుత్ సరఫరా అవుతుందని గమనించకుండా నా భార్య అయిన లక్ష్మి మరియు పోచవ్వ ఫెన్సింగ్ వైరు సహాయంతో కిందికి దిగే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై వారిద్దరు కింద పడిపోగా ఆమెతో పాటు ఉన్న మహిళలు వారిని లేపి నాకు సమాచారం అందించగా నేను వెంటనే వెళ్లి అక్కడ చూసి వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న డాక్టర్ పోచమ్మకు విద్యుత్ గాయం కాగా నా భార్య అయిన లక్ష్మి మరణించిందని తెలిపారు. ఇట్టి విషయంపై రాయపోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా రాయపోల్ ఎస్సై మానస కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking