
మేడారం వన దేవతలను దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు
చేర్యాల, జనవరి19 అక్షిత న్యూస్: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం రోజున ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా,గురువారం చేర్యాల మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని,తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరింపజేయాలని, కేసీఆర్ సంకల్పానికి అమ్మవార్లు కటాక్షించి బలాన్ని చేకూర్చి ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమం చేర్యాల మండలం ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్యాల బాల నరసయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు బాలరాజు, నాలు మండలాల యూత్ ఇంచార్జ్ శివ గారి అంజయ్య మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.