
అఖిల భారత యాదవ మహాసభలో పాల్గొన్న రాగం సుజాత నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
బాగ్ లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ, రాష్ట్ర న్యాయ విభాగం మెంబెర్, బార్ కౌన్సిల్ ఒఫ్ తెలంగాణ చలకాని వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యాదవ మహిళా న్యాయవాదుల మరియు అధికారుల సమావేశంలో మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ , ఎమ్మెల్యే భగత్ యాదవ్ , మాజీ ఆర్టీఐ ప్రధాన కమీషనర్ వర్రే వెంకటేశ్వర్లు యాదవ్, ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రమేష్ యాదవ్ తో కలిసి స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాగం సుజాత నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే తరాలకు బానిస బతుకుల నుండి విముక్తిచేసి, భావితరాలకు బంగారు బాటలు వేద్దామన్నారు. ముఖ్యంగా మహిళలకు రాజ్యాధికారంలో చాలా వెనుకబడి ఉన్నందున గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్కరిలో పోరాటపటిమను పెంచలన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం యాదవులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని అన్నారు, యాదవులు విద్యా, వ్యాపారం, రాజకీయ రంగంలో ముందుండేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామల యాదవ్, రజిని ప్రియా యాదవ్, మన్మోహన్ యాదవ్, బద్దల బాబు యాదవ్, చింతల రవీంద్రనాథ్ యాదవ్, సంధ్యారాణి యాదవ్, రాధిక యాదవ్, శ్రీదేవి యాదవ్, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ యాదవ్ వివిధ జిల్లా అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.