అక్షిత అక్షరం… ప్రజాయుధం

అక్షిత అక్షరం… ప్రజాయుధం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ

ఖమ్మం, అక్షిత బ్యూరో  :

అక్షిత అక్షరం… ప్రజాయుధంగా పరిడవిల్లుతుందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అక్షిత దిన పత్రిక ప్రజల చేతుల్లో ప్రజాపక్షంగా వెలుగొందు తుందన్నారు. ఆదివారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక ఖమ్మం- భద్రాద్రి బ్యూరో చీఫ్ షేక్ సయ్యద్ ఖాసీంతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ అక్షిత అక్షర శంఖారావం మోగిస్తూ ప్రజా సమస్యల సాధనకు కృషి చేస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ల సారధ్యంలో పత్రిక ఎన్నో సామాజిక అంశాలకు తోడుగా మానవీయ, పరిశోధనాత్మక కథనాలను వెలుగులోకి తెస్తూ పరిష్కారానికి చొరవ చూపుతుందని ఆయన తెలిపారు. మరింత నిత్య నూతనత్వంతో మరింత మున్ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. దశాబ్దంన్నర కాలంగా అక్షిత అక్షర సమరం సాగిస్తుందన్నారు. అక్షిత దిన దిన ప్రవర్ధ మానంగా అక్షిత అక్షరం ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా వెలుగొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకోల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పీపుల్స్ న్యూస్ పత్రిక ప్రతినిధి మధార్ సాహెబ్ , ప్రజాబలం పత్రిక ప్రతినిధి దండాల ప్రభాకర్ రెడ్డి, సమయ జ్వోతి పత్రిక ప్రతినిధి నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking