
పేదల పక్షం… అక్షిత అక్షర యజ్ఞం
ఎంఎల్ సి బస్వరాజు సారయ్య
వరంగల్, అక్షిత బ్యూరో :
పేదల పక్షాన అక్షిత అక్షర యజ్ఞం చేస్తూ ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా ముందుకు సాగుతుందని శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య అన్నారు. ఆదివారం వరంగల్ లో అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక వరంగల్ బ్యూరో చీఫ్ డా. పాలడుగు సురేందర్ తో కలిసి అక్షిత నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్షిత అక్షరం… ప్రజాయుధంగా పరిడ విల్లుతుందన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ అక్షిత అక్షర శంఖారావం మోగిస్తూ ప్రజా సమస్యల సాధనకు కృషి చేస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ల సారధ్యంలో పత్రిక ఎన్నో సామాజిక అంశాలకు తోడుగా మానవీయ, పరిశోధనాత్మక కథనాలను వెలుగులోకి తెస్తూ పరిష్కారానికి చొరవ చూపుతుందని ఆయన తెలిపారు. మరింత నిత్య నూతనత్వంతో మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. దశాబ్దంన్నర కాలంగా అక్షిత అక్షర సమరం సాగిస్తుందన్నారు. అక్షిత దిన దిన ప్రవర్ధ మానంగా అక్షిత అక్షరం ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా వెలుగొందుతుందన్నారు. పత్రికలు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాయన్నారు. నిష్పక్షపాత వార్తలను రాస్తూ సమాజాన్ని మేల్కొల్పేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సోమిడి రజక సంఘం నాయకులు పాలడుగుల శివ కుమార్, కిషన్, అనిల్, రమేష్ బాబు, రమేష్, రామస్వామి, సుధాకర్ తదితరులతో పాటు వరంగల్ బ్యూరో చీఫ్ డా.సురేందర్, కార్పొరేటర్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.