
*చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో అయ్యప్ప దేవాలయ భూమి పూజ హాజరైన శాసనమండలి చైర్మన్
చిట్యాల, అక్షిత ప్రతినిధి :
చిట్యాల పట్టణ కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల నూతనoగా అయ్యప్ప దేవాలయ నిర్మాణ శంకుస్థాపన జరిగింది . ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు నకరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచ్చేసి పూజలో పాల్గొని గుడి నిర్మాణ వ్యయంలో మేము కూడా పాలుపంచుకుంటామని తెలిపినారు . వీరితో పాటుగా మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది మల్లయ్య, అన్ని పార్టీల నాయకులు, ప్రముఖ వ్యాపారస్తులు, పట్టణ నలు మూలల నుండి విచ్చేసిన అయ్యప్ప భక్తులు మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గుడి నిర్మాణ అయ్యే వ్యయంలో వారి వారి తహత తగ్గట్టుగా చందాలు ప్రకటించినారు చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి పెద్దగా గుడి నిర్మాణం జరగబోతుందని చంద రవీందర్ స్వామి తెలిపినారు