*అడ్డగోలుగా కరెంట్ బిల్లు వసూలు
*మందమర్రి, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలపై కరెంట్ బిల్లు పేరుతో అడ్డగోలుగా బిల్లులు వసూల్ చేస్తుందని, ఏసిడి చార్జీలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, మందమర్రి కన్వీనర్ మొయ్య రాంబాబు డిమాండ్ చేశారు. మందమర్రి పట్టణంలో ఆదివారం కరెంట్ కష్టాలకు పరిష్కారం కోరుతూ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గతంలో డెవలప్మెంట్ చార్జీల పేరు చెప్పి బిల్లులు వసూలు చేసిన రాష్ట్ర ప్రజలు మౌనం వహించారని తెలిపారు. ప్రజలపై నిత్యావసర వస్తువులు, టోల్ ప్లాజా, పెట్రల్, డీజిల్, బస్సు చార్జీలు, పెంచుతూ, ప్రజల నడ్డి విరుస్తున్నారని, కరెంట్ బిల్లులో ఏసిడి చార్జీల పేరుతో నిలువు దోపిడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా సంవత్సరానికి 1200 యూనిట్లు వుండగా దానిపై వడ్డీ కలిపి లెక్కలు వేస్తూ 2000 నుండి 3000 రూపాయల వరకు అధికంగా బిల్లులు వసూల్ చేస్తున్నారని మండిపడ్డారు. పొట్ట కూటి కోసం జీవనం కొనసాగిస్తూ, బ్రతుకుతున్న పేద ప్రజలు 1100 రూపాయల బిల్లులను ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. బిల్లులు చెల్లించక పోతే కరెంట్ కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పట్టణ ప్రజలు ఎవరు కూడా ఏసిడి చార్జీలు కట్టవద్దని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరుపుక ప్రజలకు తెలిపారు. ఇప్పటికైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లంతా ఏకతాటి పై వచ్చి ఏసిడి చార్జీలను వెంటనే రద్దుకు పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పాత వీరస్వామి, కన్వీనర్స్ వేరెడ్ల శ్రీనివాస్, ఎండి ఖలీమ్, బిసి సంఘం నాయకులు వాల్మీకి రవి, బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు కొండిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.