
మాణిక్ రావు ఠాక్రేని కలిసిన కాంగ్రెస్ నేత యుగంధర్ రెడ్డి.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
గాంధీ భవన్ కి విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావ్ థాక్రేని కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై మరియు హాత్ సే హాత్ జోడో యాత్ర గురించి చర్చించారు. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో మరింత బలోపేతం కానుందని చెప్పారు. ప్రధానంగా కూకట్ పల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉందని తెలియజేశారు.