
మేళ్లచెరువు,అక్షిత ప్రతినిధి:
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రం లో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఒకపక్క భూ దాన భూములలో వివాదం కొనసాగుతున్నా ఆ వివాదాలను ప్రక్కన పెట్టి స్వయంగా నడిరోడ్డుకి ప్రజలకు అధికారులకు ప్రతి ఒక్కరికి కనపడే విధంగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎవరి అండదండలతో మట్టి మాఫియా కోనసాగుతోందో తెలియని పరిస్థితి ప్రభుత్వ భూములలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా మట్టిని తవ్వడం చట్టరీత్యా నేరం అలాంటిది బాహ్య ప్రపంచానికి కనబడేలా వివాదాస్పద భూదాన్ భూముల లో జెసిబి లు పెట్టి మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ యదేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వ అధికారులు గాని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఒక్కొక్క ట్రాక్టర్ మట్టి 750 రూపాయలు ట్రక్కు చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ పోలీస్ అధికారులు స్పందించి మట్టి మాఫియాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు