అంబరాన్నంటిన రవిచంద్ర బర్త్ డే సంబరాలు

*ఎంపీ రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు

సోమవారం అర్ధరాత్రి ఘనంగా ప్రారంభo

*ఫోన్ ద్వారా రవిచంద్రకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి*

*శుభాకాంక్షలు తెలిపేందుకు బంజారాహిల్స్ లోని ఎంపీ రవిచంద్ర నివాసానికి వందలాది మంది తరలి రావడంతో సందడి నెలకొంది,పండుగ వాతావరణం సంతరించుకుంది*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు సోమవారం అర్ధరాత్రి (మంగళవారం తెల్లవారుజామున) ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలు,నగరంలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చిన బంధుమిత్రులు,బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రముఖులతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వందలాది మంది బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి తరలి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది,పండుగ వాతావరణం సంతరించుకుంది.ఆయన మొదట తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు.

అటు తర్వాత పలువురు వెంట తీసుకుని వచ్చిన కేక్స్ కట్ చేశారు,అతిథులందరికి తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం, మిఠాయిలు పంచారు.ఈ సందర్భంగా మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం రావు,ఆవుల రామారావు, గంధం నాగేశ్వరరావు, మామిళ్ల శ్రీనివాస్,వేల్పుల శ్రీనివాస్,మాలి కరుణాకర్,కోట్ల వినోద్,ఉప్పు రవీందర్,సంపత్ తదితరులు రవిచంద్రను గజమాల, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.బీఆర్ఎస్ నాయకులు జెన్నాయికోడే జగన్మోహన్, చంద్రశేఖర్ లు బాణసంచా పేల్చి V R C (వద్ధిరాజు రవిచంద్ర)అన్న అక్షరాలతో ప్రత్యేకంగా చేయించిన కేక్ ను ఆయనతో కట్ చేయించారు.ఓరుగల్లు నాయీ బ్రాహ్మణ సంఘం ప్రముఖులు కొత్తపల్లి వెంకటయ్య ఎంపీ రవిచంద్ర గొప్పతనాన్ని కీర్తిస్తూ రాసిన కవితను అందరి సమక్షంలో చదివి వినిపించారు.ఆయనతో పాటు వచ్చిన కస్తూరి సతీష్, రాజేందర్, యాదగిరి,వెంకట్, కృష్ణ లు రవిచంద్రకు శుభాకాంక్షలు చెప్పారు.పంజగుట్టకు చెందిన నారాయణ, విష్ణు,వెంకట్ గౌడ్, సంతోష్ తదితరులు తల్వార్,ఫోటో ఫ్రేంను ఎంపీ వద్ధిరాజుకు బహుకరించారు.నేటిధాత్రి దినపత్రిక ఎడిటర్ కట్టా రాఘవేందర్,టీఎన్జీవో ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు అఫ్జల్ హసన్, ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్, వ్యాపారవేత్తలు మరికల్ పోత సుధీర్ కుమార్,బంకు శ్రీనివాస్ (వరంగల్),హైకోర్టు న్యాయవాదులు ఊసా రఘు, శేషగిరిరావు, అనిల్,కాపునాడు జాతీయ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు, నాయకులు గిద్దా శ్రీనివాస్ నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి జనార్థన్ తదితరులు రవిచంద్రకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే,వరంగల్ నగరానికి చెందిన నిరంజన్,కిరణ్, మహ్మద్ అక్రం, మహ్మద్ గౌస్ పాషా, పెద్దపల్లికి చెందిన స్వామి వివేక్ పటేల్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు సాదావారి సాయిపటేల్,కే.శ్యామ్,నిర్మల్ జిల్లా కు చెందిన హరీష్, జగద్గిరిగుట్ట ప్రముఖులు పర్వతం సతీష్, తోట వేణు,పంతుల మల్లయ్య,బత్తుల రాంనర్సయ్య,సుంకరి వెంకటేష్,తన వద్ద పనిచేసే సిబ్బంది తదితరులు రవిచంద్రకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ మిషన్ (HRPM)నూతన సంవత్సర కేలండర్ ను ఆవిష్కరించారు.తెలంగాణలోని వివిధ జిల్లాలు, నగరంలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వచ్చిన బంధుమిత్రులు,బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు,ప్రముఖులతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking