*డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్*

*డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్*

వరంగల్ ,అక్షిత బ్యూరో :

దుపకుంటలోని రెండు పడకల ఇండ్ల నిర్మాణ స్థలిలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనుల గురించి హౌసింగ్, ఆర్&బి, విద్యుత్ మరియు కాంట్రాక్టర్లు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ పేదలకు గౌరవ ప్రదమైన సౌకర్యవంతమైన నివాసము ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పథకం క్రింద వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2200వందల ఇండ్ల మంజూరు చేయడం జరిగిందని అందులో భాగంగా నిర్మిస్తున్న గృహా నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ఇండ్లు లేని పేద ప్రజల కల సాకారం చేయాలని,అదే విదంగా గృహ నిర్మాణంలోని నీటి,విద్యుత్ సమస్యలు,పార్కుల ఏర్పాటు తదితర సమస్యలపై కూలంకషంగా చర్చించి సంబంధిత మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులకు నిర్దేశం చేశారు. వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని,పూర్తయిన ఇండ్లలో విద్యుత్ మరియు నీటి సదుపాయాలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఇండ్ల నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్,13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి,ఎమ్మారో ఫణి తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking