సూర్యాపేట,అక్షిత ప్రతినిధి:
సమాచార హక్కు వికాస సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కేంద్ర లో మంగళవారం మంత్రి క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా సమాచార హక్కు వికాస సమితిసభ్యులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సమాచార హక్కు వికాస సమితి గౌరవ అధ్యక్షులు వి3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, వ్యవస్థాపక వ్యవస్థాపకులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి,జిల్లా అధ్యక్షులు గుంట కండ్ల ముకుందా రెడ్డి,ప్రధాన కార్యదర్శి చేకూరి శివ, గౌరవ అధ్యక్షులు వున్నం సత్యనారాయణ,రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి బండారు రాజా, జిల్లా కమిటీ సభ్యులు ఆలూరు విక్టర్ బాబు, కిన్నెర ఉపేందర్ రావు, కాసర్ల రాజు, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల అధ్యక్షులు పగిడిపల్లి ఏసు పాదం, కాసర్ల సురేందర్ రెడ్డి,దండ వెంకటరెడ్డి, మజాహరే, శ్రీరాములు, రామ్మూర్తి,పాతకోటి రామారావు,జె. ప్రశాంత్,వి3 జిల్లా ప్రతి నిధి రాంబాబు గౌడ్,నల్లగొండ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బైరు సైదులు గౌడ్, చిత్రం శ్రీను, తరుణ్,కె. వేణుగోపాల్ రెడ్డి,నాగేంద్రబాబు నర్సింగ్ వెంకన్న,కన్నెబోయిన అంజయ్య,మామిడి పరందాములు, మామిడి అంబేద్కర్, కొండేటి గోపి తదితరులు పాల్గొన్నారు.