* ఆర్ అండ్ బి రోడ్డుపై చికెన్ విక్రయాలు *
* పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు *
* గ్రామ సభలో చేసిన తీర్మానం ఎప్పుడు అమలు అయ్యేది..? *
* గ్రామపంచాయతీ నోటీసులను లెక్కచేయని చికెన్ వ్యాపారులు *
గోవిందరావుపేట అక్షిత ప్రతినిధి
పసర గ్రామంలోని నార్లాపూర్ రోడ్డులో రామాలయం దగ్గర్లో నడిరోడ్డుపై ఏర్పాటుచేసిన చికెన్ సెంటర్లతో మేడారం వెళ్లే భక్తుల వాహనాలకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. చికెన్ సెంటర్ నిర్వాహకులు చికెన్ వ్యర్ధాలను నడిరోడ్డుపై పడి వేయడంతో పదుల సంఖ్యలో కుక్కలు గుముగుడి ఆ దారి వెంట వచ్చి పోయే ప్రజలపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. అయితే గతంలో పసర గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభలో చికెన్ సెంటర్ల నిర్వహణతో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని ప్రజలు తెలపడంతో రోడ్డుపై నుండి చికెన్ సెంటర్లను తొలగించేలా గ్రామ సభలో తీర్మానం చేశారు అయితే నెలలు కావస్తున్న గ్రామపంచాయతీలో చేసిన తీర్మానం అమలు కాకపోవడంతో ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పసర గ్రామపంచాయతీ నుంచి పలుమార్లు నోటీసులు పంపినా కూడా వ్యాపారులు లెక్క చేయకుండా వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నారు. మంగళవారం వారం సంత కావడంతో చికెన్ వ్యాపారులు నడి రోడ్డుపై వ్యాపారం నిర్వహిస్తుండడంతో నార్లాపూర్ రహదారిలో వచ్చి పోయే వాహనాలతో మార్కెట్ కోస్తున్న ప్రజలు చికెన్ సెంటర్ల నిర్వహణ నడి రోడ్డుపై ఉండడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా తక్షణమే అధికారులు స్పందించి నడి రోడ్డుపై నడుస్తున్న చికెన్ సెంటర్లను తొలగించాలని గ్రామంలోని ప్రజలు కోరుకుంటున్నారు.
పేపర్ రేటుకు చికెన్ విక్రయించని వ్యాపారులు
పసర గ్రామంలో ఉన్నటువంటి చికెన్ వ్యాపారులు పేపర్ రేటును ఏమాత్రం పట్టించుకోరు పేపర్ రేట్ లో 180 రూపాయలు ఉంటే పసర గ్రామంలోని వ్యాపారులు మాత్రం మాకు ఏం సంబంధం లేనట్టు వీళ్లే సపరేట్ ఫిక్స్ చేస్తూ కిలో కి 260 రూపాయలు అమ్ముతున్నారు.