అభివృద్ధిలోనే రాజకీయ ప్రత్యర్థులతో పోటీ * పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

*అభివృద్ధిలోనే రాజకీయ ప్రత్యర్థులతో పోటీ
* కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ దేశానికే రోల్ మాడల్
* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అభివృద్ధి, ప్రజాసంక్షేమం విషయంలోనే రాజకీయ ప్రత్యర్థులతో తాము పోటీ పడతామని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మాడల్ గా మారిందని ఆయన కితాబిచ్చారు. రాష్ట్రాభివృద్ధి బీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యమని భావించిన యువత పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని, ప్రతి కార్యకర్త కుటుంబానికి బాసటగా నిలుస్తోన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. షాబు నగర్ లో 5కోట్ల 50లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న వైకుంఠ ధామం నిర్మాణానికి, సీతారాంపురంలో 8లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు, ఇందిరమ్మ కాలనీలో 30 లక్షల రూపాయలతో నిర్మించిననున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి భాస్కర్ రావు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ప్రజారోగ్య శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు బాసాని గిరి, పట్టణ యువజన అధ్యక్షులు, కౌన్సిలర్ షేక్ జావిద్, మలగం రమేశ్, సాధినేని స్రవంతి శ్రీనివాస్, వంగాల నిరంజన్ రెడ్డి, ఇలియాస్, బంటు రమేశ్, పునాటి లక్ష్మీనారాయణ, వడ్డేపల్లి శ్రీనివాస్, మాజీద్, మన్నెం లింగారెడ్డి, తిరుమలగిరి వజ్రం, వేముల దుర్గారావు, వింజం శ్రీధర్, తిరంశెట్టి కోటేశ్వర్ రావు, మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి, కొట్టా ఆంజనేయులు, వింజం రాజేందర్, సుంకోజు మురళీ చారి, జంజరాల నాగరాజు, యర్రబోతు సంజీవ రెడ్డి, షేక్ ఫయాజ్, షైక్ నాగుల్ బాబా, అహ్మద్, షేక్ అజీజ్, తదితరులు పాల్గొన్నారు.