*ఉదయం కాంగ్రెస్,మధ్యాహ్నం సిపిఎం పార్టీలో చేరిక*మొల్కపట్నంలో రాజకీయ హైడ్రామా* 

*ఉదయం కాంగ్రెస్ ,  మధ్యాహ్నం సిపిఎం పార్టీలో చేరిక*         

మొల్కపట్నంలో  రాజకీయ హైడ్రామా*   

అక్షిత ప్రతినిధి,  వేములపల్లి :

 రాజకీయంగా చైతన్యవంతమైన వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామoలో సాదారణ ఎన్నికలు మరో ఏడాది కాలం ఉండగానే రాజకీయాలు వేడెక్కుతున్నాయి దీనికి  బుధవారం జరిగిన రాజకీయ హైడ్రామా ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే మొల్కపట్నం గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్, ప్రస్తుత గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు జేర్రిపోతుల ఎల్లమ్మ  తదితరులు మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరి మూడు రంగుల కండువా కప్పుకున్నారు. తిరిగి గ్రామానికి చేరుకొని సీపిఎం పార్టీ కార్యాలయంలో  సీపిఎం పార్టీ మండల కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్దని ల సమక్షంలో మాతృసంస్థ అయిన సీపిఎం పార్టీలో చేరి ఎర్రకండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన పని ఉంది మిర్యాలగూడకు రమ్మని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ కండువా కప్పడం కాంగ్రెస్ పార్టీ దిగజరుడు తనానికి నిదర్శనమన్నారు.కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన మొల్కపట్నం గ్రామంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాంగ్రెస్ కుటిల పన్నాగాలు సాగవన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెమిడాల బిక్షం, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking