మినీ మేడారం ఏర్పాట్లను పరిశీలించిన. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

మినీ మేడారం ఏర్పాట్లను పరిశీలించిన.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

పినపాక అక్షిత ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని తోగుడెం గ్రామం నందు వచ్చేనెల 1.02.2023 నుండి 4.02.2023 జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పరిశీలించారు. తదనంతరం మినీ మేడారం జాతర కరపత్రాలను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న సీఎం కేసీఆర్ కి తల్లుల దీవెనలు ఉండాలని వారు ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర పరిసర ప్రాంతాలతో పాటు భక్తుల కోసం ఏర్పాటుచేసిన పలు ఏర్పాట్లను పరిశీలించి పలు సలహాలు సూచనలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking