మాదిగ జాతి ఉన్నతి కోసం పాటుపడతాం. రావులపల్లి రామ్మూర్తి మాదిగ ఐక్యవేదిక పినపాక మండల నూతన కమిటీ ఎన్నిక

మాదిగ జాతి ఉన్నతి కోసం పాటుపడతాం. రావులపల్లి రామ్మూర్తి మాదిగ ఐక్యవేదిక పినపాక మండల నూతన కమిటీ ఎన్నిక

పినపాక అక్షిత ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో సోంపల్లి తిరుపతి అధ్యక్షతన మాదిగ ఐక్యవేదిక మండల కమిటీ సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గం మాదిగ ఐక్యవేదిక అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి పాల్గొని మాట్లాడుతూ మాదిగ జాతి ఉన్నతి కోసం అందరం పాటుపడాలని, అందరూ ఐక్యతను చాటుతూ మాదిగ జాతి అన్ని రంగాల్లో రాణించడానికి కృషి చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏర్పాటుచేసిన నియోజకవర్గ మాదిగ ఐక్యవేదిక కమిటీ అన్ని మండలాల్లో పర్యటిస్తూ మండల కమిటీలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈనెల 30న మణుగూరులో ప్రారంభించనున్న నియోజకవర్గపు కార్యాలయం ప్రారంభోత్సవంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మరి కొద్ది రోజుల్లోనే పినపాక నియోజకవర్గం మాదిగల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాదిగ ఐక్యవేదిక నియోజకవర్గ నాయకులు డిసిసిబి మాజీ డైరెక్ట్ బోయిళ్ళ రమణయ్య మాదిగ ఐక్య వేదిక మీడియా ఇంచార్జ్ సిద్దెల తిరుమల రావు బోయిళ్ళ రాజు బందు నరేష్ సూది పోగు నాగరాజు పోడుతూరి విక్రమ్ ఈ సందర్భంగా నూతన మాదిగ ఐక్యవేదిక మండల కమిటీని వెయ్యడం జరిగింది. మండల కమిటీ అధ్యక్షుడిగా దేపక శివ, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల సాగర్, ఉపాధ్యక్షులుగా గంగరాజు, తోకల సతీష్, సంతోష్, కార్యదర్శులుగా నాగేష్, సాంబశివరావు, సాంబయ్య, మీడియా సలహాదారుడుగా నాగరాజు, గౌరవ అధ్యక్షులుగా సోంపల్లి తిరుపతి సలహాదారులు గద్దల వెంకటేశ్వర్లు ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమాలు. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking