మిషన్ భగీరథ కార్మికులకు జీతభత్యాలు త్వరితగతిన చెల్లించాలి

-మిషన్ భగీరథ కార్మికులకు జీతభత్యాలు త్వరితగతిన చెల్లించాలి

-డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త కర్నే  రవి  

-సమాచార హక్కు చట్టం ద్వారా మిషన్ భగీరథ ఈఈకి షోకాసు నోటీసులు 

– తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి మిషన్ భగీరథ కార్మికుల తరఫున పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన కర్నే రవి 

పినపాక అక్షిత ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న వారి పేరు, తండ్రి పేరు, చిరునామా వారి యొక్క విద్యార్హతలు, జీతభత్యాలు వారికి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులుకూ సంబంధించిన  ఐడి కార్డు, నకళ్ళు, వారి హోదా,  పని చేస్తున్న గ్రామ పంచాయతీ పేరు ఇవ్వాలని 17.11.2021 తేదీ నా సమాచారం హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుకు సంవత్సరం గడిచిన సమాచారం ఇవ్వలేదని సామాజిక కార్యకర్త కర్ణ రవి తెలిపారు. 24.01.2023 తేదీన సమాచారం కమిషనర్ హైదరాబాద్ ముందు హాజరు అయ్యారు. సరైన సమాచారం ఇవ్వనందుకు మిషన్ భగీరథ ఈఈకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  672 మిషన్ భగీరథ కార్మికులు శ్రమకు తగిన వేతనం ఇవ్వకుండా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. కోంత మంది కార్మికులుకు సమయానికి జీతభత్యాలు రాక భార్యాభర్తలు గొడవ పడి ఆత్మహత్యా చేసుకున్నారని సామాజిక కార్యకర్త కర్నే రవి తెలిపారు. శ్రమను దోపిడి చేస్తే ఉంటే అధికారులు ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని అన్నారు. కనీసము ఇప్పటికైనా విచారణ జరిపి వారికి శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. లేనిపక్షంలో తెలంగాణ హై కోర్టు ఆశ్రయించి మిషన్ భగీరథ కార్మికులు తరపున పోరాటం చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking