సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

పినపాక అక్షిత ప్రతినిధి:

పేదలకు ఆసరాగా నిలుస్తున్నదని పినపాక మండల బిఆర్ఎస్ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. పినపాక మండల పరిధిలోని చింతల బయ్యారం గ్రామానికి చెందిన పొనగంటి సాంబశివరావు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన 12 వేల చెక్కును మంగళవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేదల కుటుంబాలకు ఎంతగానో అండగా నిలుస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలోని వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఉపసర్పంచ్ మునిగల సంతోష్, పొనగంటి నరేష్, పొనగంటి జంపయ్య,పొనగంటి వెంకన్న, బి ఆర్ యస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తోట రాజేష్, బొల్లె నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking