దేశ ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు దండు ఇస్తరి.
రాజేంద్రనగర్,అక్షిత ప్రతినిధి: శంషాబాద్ మండల పరిధిలోని
సుల్తాన్ పల్లి గ్రామం లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గ్రామా పంచాయితీ ఆవరణలో *సర్పంచ్ దండు ఇస్తారి (సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దేశం కోసంప్రాణాలు ప్రణంగా పెట్టి దేశం కోసం కొరాడిన విషయాలను ఇస్తరి స్మరించుకున్నారు.స్వాతంత్రం సాధనకోసం పోరాడిన అమరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.వారిబాటలో నడుస్తూ దేశం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్పందన సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ సంగీత సిద్దేశ్వర్, వార్డ్ సభ్యులు శ్రీశైలం, మౌనిక, పాండు రంగ రెడ్డి,అరుంధ, వీరేశం,సత్యమ్మ, సామయ్య,
కృష్ణ , వీరచారి, గ్రామా కార్యదర్శి, కారోబర్, గ్రామా ముఖ్య నాయకులూ తదితరులు పాల్గొన్నారు.