రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం -ప్రియదర్శిని మేడి

రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం

-ప్రియదర్శిని మేడి

నకిరేకల్ అక్షిత ప్రతినిధి

భారత రాజ్యాంగం గొప్పదనం కారణంగానే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా నిలబడిందని బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్. అంబేద్కర్ దార్శనికతతో రాసిన రాజ్యాంగం కారణంగానే మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతూ దేశం సుభిక్షంగా ఉందన్నారు. రాజ్యాంగంలో పౌరులకు హక్కులతో పాటు విధులు, భాద్యతలు కూడా ఉంటాయన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే నాలుగు సింహాల జాతీయ చిహ్నం కూడా రాజ ముద్రగా గుర్తింపు పొందిందన్నారు. పొరుగు దేశాలతో పోలిస్తే మనదేశం అన్ని రంగాల్లోనూ స్థిరంగా అభివృద్ది చెందడానికి అంబేద్కర్ రాసిన పటిష్టమైన రాజ్యాంగం కారణమన్నారు. కానీ పాలకులు రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. డబ్బు, మద్యంతో ఎలక్షన్లు, రాజకీయాలు సాగుతున్నంత కాలం ఈ దేశం అభివృద్ధి చెందదని, రాజకీయ నాయకుల వాగ్దానాలు వాటి అమలు పట్ల ప్రజలు ఎల్లపుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తడక విజయ్,మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్,ఉపాధక్షులు చిత్తలూరి శివ,బివిఫ్ మండల కన్వీనర్ గద్దపాటి వంశీ, వంటేపాక ప్రదీప్,చెట్టిపల్లి మహేష్,జస్వ, నితిన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking