ఉత్తమ తహసిల్దార్ గా వలిగొండ ఆంజనేయులు

ఉత్తమ తహసిల్దార్ గా వలిగొండ ఆంజనేయులు

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో తాసిల్దార్ గా పని చేస్తున్నా వలిగొండ ఆంజనేయులు కు ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు ఘనతంత్ర దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఆఫీస్,అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తాసిల్దార్ అవార్డు అందుకున్నారు . తాసిల్దార్ గా పనిచేస్తున్న వలిగొండ ఆంజనేయులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుండటం, ప్రేమతో, ఆప్యాయతతో, చిరునవ్వుతో ప్రజలను అక్కున చేర్చుకుని వారి సమస్యల పరిష్కారం లో ఆయన చేసిన కృషి అద్భుతమని మండల, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతి చిన్న వయసులోనే తాసిల్దార్ బాధ్యత స్వీకరించి, మండల ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో, ఆయన చేసిన కృషి అద్భుతం అని ప్రజలు కొనియాడుతున్నారు. చిన్న, పెద్ద వర్గ, విభేదాలు లేకుండా కులమతాలకు అతీతంగా కార్యాలయానికి వచ్చిన వారికి సమస్యలతో వచ్చిన వారికి ప్రేమతో పలకరించి చిరునవ్వుతో సమస్యలు విని పరిష్కరించడంలో వారు చేస్తున్న కృషి అద్భుతమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముఖం పై ఎప్పుడూ చిరునవ్వే అని, ప్రేమతో, ఆప్యాయతతో, ప్రజల వద్దకు వెళుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని ఆయన కర్తవ్యంగా భావించి, అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ, ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతున్నా తహసీల్దార్ కు ఉత్తమ తాసిల్దార్ అవార్డు రావడం గర్వకారణమని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking