మువ్వన్నెల రెపరెపలు మిర్యాలగూడలో ఘనంగా గణతంత్ర వేడుకలు

మువ్వన్నెల రెపరెపలు

మిర్యాలగూడలో ఘనంగా గణతంత్ర వేడుకలు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ, పట్టణం మండలంలో గణతంత్రోత్సవాలను గురువారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఘనంగా జరిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు జాతీయపతాకాన్ని ఎగురవేశారు.

కోర్టు సముదాయంలో ఐదో అదనపు జిల్లా జడ్జి రఘునాధరెడ్డి, రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ బి.చెన్నయ్య, పోలీసు సబ్ డివిజన్ లో డిఎస్పి వై.వెంకటేశ్వరరావు, మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ తిరునగరు భార్గవ్, కమీషనర్ రవీంద్ర సాగర్,

 

మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపిపి నూకలసరళ హన్మంతరెడ్డి, తహసిల్లో తహసిల్దారు అనిల్ కుమార్, ఒన్, టూ టౌన్, రూరల్ పోలీసు స్టేషన్ లలో ఇన్స్పెక్టర్ లు రాఘవేందర్, సురేష్, సత్యనారాయణ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ సమరధ్ శ్రీనివాస్, ఆగ్రో ఫాంలో ఫర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెడ్ల జవహర్ బాబు, వింజం రాజేందర్, కాంగ్రెసు కార్యాలయంలో పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, వార్డుల్లో కాంగ్రెసు మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్‌‌ లక్ష్మారెడ్డి, ఎన్ఎస్పి డివిజన్ లో ఇఇ కరుణాకర్, ఆర్టీసి డిపోలో డిపో మేనేజర్ బి.పాల్, విద్యుత్ డివిజన్ లో డిఇ వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్ స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, మార్కెట్ కమిటీలో కార్యదర్శి శ్రీధర్ జాతీయపతాకాలను ఆవిష్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking