మండల వ్యాప్తంగా ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
చేర్యాల,జనవరి 26 అక్షిత ప్రతినిధి: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా,గురువారం చేర్యాల మున్సిపాలిటీ తో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ఎస్ కె హరిఫా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను జరుపుకోగా,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సయ్యద్ తార్విక్ అన్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజేంద్ర కుమార్, పోలీస్ స్టేషనులో ఎస్సై భాస్కర్ రెడ్డి త్రివర్ణ పతాకం ఆవిష్కరించగా, నాగపురి, రాంపురం, చుంచనకోట,వేచరేణి ఆకునూరు తదితర గ్రామాల్లో సర్పంచులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఆకునూరు గ్రామ పరిధిలోని మాసిరెడ్డిపల్లిలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రంగుల జెండాను ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్,వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి,ఏఎంసి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్స్, మున్సిపల్ చైర్పర్సన్ ఏ స్వరూప రాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి,కౌన్సిలర్లు మరియు ప్రజా ప్రతినిధులు,నాయకులు, అధికారులు,సిబ్బంది,యువకులు తదితరులు పాల్గొన్నారు.