పాఠశాలకు ఆట వస్తువులు, డయాస్ బహుకరించిన పూర్వ విద్యార్థులు
చిట్యాల ,అక్షిత ప్రతినిధి: నల్గొండ జిల్లా చిట్యాల మండల ఉరుమడ్ల గ్రామం 1994 -95 పూర్వ పదవ తరగతి విద్యార్థులు అందరూ కలిసి తాము చదువుకున్న జెడ్పిహెచ్ఎస్ ఉరుముడ్ల పాఠశాలకు 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలకు ఆట వస్తువులను , విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లను, డయాస్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవాపాలు ,సర్పంచ్ కచర్ల శ్రీనివాస్ రెడ్డి, ఎం.పి.టి.సి పెడ్డగొని సత్యం యాదవ్, ఉపసర్పంచ్ ఉయ్యాల లింగయ్య , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , 1994 – 95 పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు