వాడి వేడిగా సర్వసభ్య సమావేశం

*వాడి వేడిగా సర్వసభ్య సమావేశం*

**అధికారులు ప్రజాప్రతినిధులు లేక కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న జనరల్ బాడీ సమావేశం**…..
**సమస్య వలయాల్లో గ్రామ పంచాయతీలు ఉంటే అధికారులు నిమ్మకు నిరత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు***….
అక్షిత న్యూస్ మాడుగులపల్లి:
మాడుగులపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఎంపీపీ పోకల శ్రీవిద్యారాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు సభ్యులు పలు సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. అర్హులైన పలువురికి ఆసరా పింఛన్లు రావడం లేదని.. ఎందుకు మిస్సయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ల ఖాళీలు, ఆయాల పోస్టుల వివరాలు ప్రభుత్వానికి పంపాలని, వృద్ధాప్యం, రోగులు, లేవలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు బియ్యం పంపిణీకి ప్రత్యామ్నాయం చూడాలని చిరుమర్తి సర్పంచ్‌ శ్రీశైలం అధికారులను కోరారు. చిరుమర్తి గ్రామంలో గత మూడు సంవత్సరాల క్రితం పల్లె ప్రకృతి వనం కోసం ఇద్దరు రైతులు వారి సొంత భూమి నాలుగు గుంటలు ఇవ్వగా వారికి వేరే చోట గ్రామపంచాయతీ ఫ్లాట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు ఇప్పటివరకు ఆ గ్రామస్తులకు ఒప్పందం ప్రకారం 4గంటల భూమి అధికారులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్లాక్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మూడు నాలుగు రోజుల్లో ఇట్టి సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తానని ఎంపీపీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జడ్పిటిసి పుల్లేముల సైదులు డిమాండ్‌ చేశారు. సమావేశానికి అధికారులు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు వచ్చి ఏం చేయాలో వారి సమస్యలకు ఎవరికి విన్నవించాలని అయోమయంలో ప్రజాప్రతినిధులు ఉన్నారని తెలిపారు. కనీసం మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ సమావేశానికి అధికారులు రాకపోవడం శోచనీయమన్నారు. మండలంలో ప్రధాన సమస్య విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో కరెంట్ లైన్ సరిగా లేకపోవడం ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధీకరణ చేయక రైతులు ఇబ్బందులు పడుతున్న పలుమార్లు ఫోన్లో ద్వారా విద్యుత్ శాఖ అధికారులకు లైన్మెన్ లకు తెలియజేసిన ఫలితం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే గ్రామాలలో రైతులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ధర్మాపురం ఎంపీటీసీ దశరథ మాట్లాడుతూ మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి వలన ప్రభుత్వ చెరువులలో పోయవలసిన చేప పిల్లలను ప్రైవేటు వ్యక్తులకు కుంటలలో గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధులకు తెలియకుండా పోసారని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మోషన్ అలీ మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వ పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరేలా చూడాలని తెలిపారు కోట్ల రూపాయలతో ప్రభుత్వా పథకాలు ఇస్తున్న గ్రామాలలో సమస్యలు పేరుకు పోతున్నాయి అటువంటి సమస్యలను గుర్తించి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని తగు పరిష్కారాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దండ జితేందర్ రెడ్డి, పశు వైద్య అధికారి వినయ్ కుమార్, పాములపాడు ప్రాథమిక వైద్య డాక్టర్ సంజీవ, ఎంపీటీసీలు కత్తి కనక రెడ్డి,షఫీ, దశరథ, సింగం శివ,శ్రీనివాస్ రెడ్డి, సైదులు, అధికారులు ప్రజాప్రతిని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking