ఆర్టీసీ ఎండీ ని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్
వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎం.డి వి సి సజ్జన్నార్ ను ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు.