యువ ఆర్టిస్టులుగా ఎదగాలి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ అక్షిత ప్రతినిధి : కళాకారులు తమ నైపుణ్యం ద్వారా యువ కళాకారుల ఎదగాలని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన యువ దర్శకుడు,ఆర్టిస్ట్ బొడ్డుపల్లి (ఆర్.కే.ఎస్) మహేష్ పెద్దగట్టు లింగన్న జాతర సందర్భంగా చిత్రీకరించిన పెద్దగట్టు లింగన్న జాతర వీడియో సాంగును ఆర్ కే ఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువ కలాకారుడు ఎదిగేందుకు తనవంతు సహాయ, సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బొడ్డుపల్లి మహేష్ అండ్ టీం ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం , మండల పార్టీ అధ్యక్షులు ఊటుకూరి ఏడుకొండలు , నూక సైదులు నకిరేకల్ మార్కెట్ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ ,పామనగుండ్ల సర్పంచ్ సైదిరెడ్డి, పులిగిల వెంకన్న , ఊటుకూరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు….